News

ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం


హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాసయాదవ్‌, లక్ష్మారెడ్డి, చందూలాల్‌, ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ నరసింహన్‌ వారిచేత ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఉపముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్‌ అలీ, శాసనసభాపతి మధుసూదనాచారి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నగరంలోని పలు ప్రాంతాలనుంచి రాజ్‌భవన్‌కు వెళ్లే రహదారులపై గులాబీ రంగు ఫ్లెక్సీలు రెపరెపలాడాయి.

కొత్త మంత్రులు ... శాఖలు !
సీఎం కేసీఆర్ కేబినెట్లో కొత్త మంత్రులు ఆరుగురికి శాఖలు కేటాయించినట్లు సమాచారం.
1) జూపల్లి కృష్ణారావు   - పరిశ్రమలు
2) తుమ్మల నాగేశ్వరరావు - రోడ్లు, భవనాల శాఖ
3) సి.లక్ష్మారెడ్డి - విద్యుత్ శాఖ
4) తలసాని శ్రీనివాసయాదవ్ - పర్యాటక శాఖ
5) ఎ.ఇంద్రకరణ్ రెడ్డి - గృహనిర్మాణం శాఖ
6) ఏ. చందూలాల్ : సంక్షేమ శాఖ